శ్రీకాకుళం జిల్లాలో వరి పంట తర్వాత అత్యధికంగా మొక్కజొన్న పంట రైతులు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ మొక్కజొన్న పంటను 14వేల 500 హెక్టార్లలో సాగు చేశారు. పంట చేతికి వచ్చే సమయానికి కంకులను కత్తెర పురుగులు తినేస్తోంది. ఇది చూసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. పురుగు కాటుతో దిగుబడులు తగ్గిపోతాయని వాపోతున్నారు. జిల్లాలో సుమారు 5 వేల హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లిందని..నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
మొక్కజొన్నకు కత్తెర కాటు... రైతన్న ఆదాయనికి చేటు.... - శ్రీకాకుళం జిల్లా
శ్రీకాకుళం జిల్లాలో మొక్కజొన్న రైతుకు కొత్త కష్టం వచ్చి పడింది. మంచిగా పండిన పంట చేతికి వచ్చే సరికి కంకులను కత్తెర పురుగు తీనేస్తోంది. ఇది చూసిన రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.
మొక్కజొన్న కంకెలో కత్తెర పురుగు..రైతుల ఆందోళన