ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కాళీపట్నం రామారావు కథా నిలయం శ్రీకాకుళం జిల్లాకు తలమానికం' - శాసన మండలి తెలుగు భాషా సంస్కృతి కమిటీ తాజా వార్తలు

శ్రీకాకుళంలోని కాళీపట్నం రామారావు కథా నిలయాన్ని శాసన మండలి తెలుగు భాషా సంస్కృతి కమిటీ ఛైర్మన్ మహ్మద్ అహ్మద్ షరీఫ్ సందర్శించారు. జిల్లాకు తలమానికంగా ఈ కథా నిలయం నిలుస్తుందని పేర్కొన్నారు.

sasana mandali telugu bhasa samskruthi Committee visits Kalipatnam Rama Rao Katha Nilayam in Visakha A Colony Srikakulam
'కాళీపట్నం రామారావు కథా నిలయం శ్రీకాకుళం జిల్లాకు తలమానికం'

By

Published : Jan 23, 2021, 1:21 PM IST

శ్రీకాకుళంలోని విశాఖ ఎ కాలనీలో ఏర్పాటు చేసిన కాళీపట్నం రామారావు కథా నిలయాన్ని శాసన మండలి తెలుగుభాషా, సంస్కృతి కమిటీ సందర్శించింది. ఇది జిల్లాకు తలమానికంగా నిలుస్తుందని కమిటీ ఛైర్మన్ మహ్మద్ అహ్మద్ షరీఫ్ అన్నారు. కథలన్నింటినీ ఒకే చోట పొందుపరచే మహాయజ్ఞాన్ని చేపట్టిన కాళీపట్నం రామారావు మాస్టారి ప్రయత్నం అభినందనీయమని ప్రశంసించారు.

కథా రచయిత, సాహితీవేత్త, కథల అభిమానిగా మాస్టారు.. ఇప్పటి వరకు లక్ష కథలను సేకరించారని చెప్పారు. అందులో సుమారు 70 శాతం కథలను డిజిటలైజ్ చేయడం.. చాలా ఆనందదాయకమన్నారు. నిస్వార్థ సాహిత్య సేవకు ఇదొక నిదర్శనమని కీర్తించారు. కార్యక్రమంలో భాగంగా.. కాళీపట్నం రామారావు మాస్టారిని శాసనమండలి తెలుగుభాషా, సంస్కృతి కమిటీ సత్కరించింది.

ABOUT THE AUTHOR

...view details