ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Controversial Notice: 'డబ్బు కట్టలేదా?..పింఛన్ ఇవ్వొద్దు'..గ్రామ కార్యదర్శి వివాదాస్పద ఉత్తర్వులు ! - గ్రామ కార్యదర్శి వివాదస్పద నోటీసులు

Village Secretary Controversial Notice: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వులు వివాదాస్పదంగా మారాయి. గ్రామంలో వన్​టైమ్ సెటిల్​మెంట్ డబ్బులు కట్టని వారికి పింఛన్ ఇవ్వొద్దని వాలంటీర్లను ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చారు. ఎంపీడీవో మౌఖిక ఆదేశాల మేరకే ఉత్తర్వులు ఇచ్చినట్లు నోటీసుల్లో పేర్కొనటం చర్చనీయాంశంగా మారింది.

గ్రామ కార్యదర్శి వివాదస్పద ఉత్తర్వులు
గ్రామ కార్యదర్శి వివాదస్పద ఉత్తర్వులు

By

Published : Nov 30, 2021, 9:20 PM IST

Updated : Dec 1, 2021, 7:42 AM IST

Village Secretary Controversial Notice: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వులు చర్చనీయాంశంగా మారాయి. వన్​టైమ్ సెటిల్​మెంట్ డబ్బులు కట్టని వారికి పింఛన్ ఇవ్వొద్దని వాలంటీర్లను ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చారు. వాలంటీర్లు ఎవరైనా ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవటమే కాకుండా ఆ మొత్తం వసూలుకు వారినే బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. ఓటీఎస్ డబ్బులు చెల్లించాల్సిన వారి కుటుంబీకుల పింఛను నెంబర్లు, రేషన్ కార్డు నెంబర్లు, వారిలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆ వివరాలను వాలంటీర్లు సేకరించి డిజిటల్ అసిస్టెంట్​కి ఇవ్వాలని ఆదేశించారు. ఎంపీడీవో మౌఖిక ఆదేశాల మేరకే ఉత్తర్వులు ఇచ్చినట్లు నోటీసుల్లో పేర్కొనటం గమనార్హం.

గ్రామ కార్యదర్శి జారీ చేసిన నోటీసులు

Action on Santhabommali Village Secretary: ఓటీఎస్‌పై సర్క్యులర్ జారీ చేసిన సంతబొమ్మాలి గ్రామ కార్యదర్శిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సంబంధిత ఎంపీడీఓకు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ఈ సర్క్యులర్‌ వెనుక కుట్ర కోణం ఉందని.. రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. పేదలకు మేలు చేస్తున్న ఓటీఎస్‌ను అడ్డుకునేందుకే ఈ తరహా సర్క్యులర్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. పేద ప్రజలకు భరోసా కల్పించేలా ఇళ్లపై హక్కు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. ప్రతిపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయని మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు.

TDP fire on OTS: ఓటీఎస్‌ పేరిట జగన్ ప్రభుత్వం ప్రజలను నిలువు దోపిడీ చేస్తోందని.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటీఎస్‌ కట్టని వారింట్లో అవ్వాతాతల పింఛను ఆపేయాలని సర్క్యులర్ ఇవ్వడం.. కాల్ మనీ మాఫియా వేధింపులను తలపిస్తోందన్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో పంచాయితీ కార్యదర్శి సర్క్యులర్‌ను లోకేశ్‌ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ఇదీ చదవండి

వేల లీటర్ల నీటిని మింగేస్తున్న 'మాయా బావి'

Last Updated : Dec 1, 2021, 7:42 AM IST

ABOUT THE AUTHOR

...view details