ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా పరీక్షలకు సంజీవని బస్సులు సిద్ధం - శ్రీకాకుళం జిల్లాలో కరోనా పరీక్షలకు సంజీవని బస్సులు

శ్రీకాకుళం జిల్లాలో కరోనా నమూనాలను సేకరించే సంజీవని మొబైల్ బస్సు సేవలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి.

srikakulam district
శ్రీకాకుళం జిల్లాలో సంజీవని బస్సులు

By

Published : Jul 31, 2020, 11:45 PM IST

శ్రీకాకుళం జిల్లాలో కరోనా నమూనాలను సేకరించే సంజీవని మొబైల్ బస్సు సేవలను జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చెంచయ్య, నగర పాలక సంస్ధ కమిషనర్ నల్లనయ్య, ఆర్డీవో రమణ లాంఛనంగా ప్రారంభించారు. స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు చేయించుకునేందుకు వచ్చే వారి కోసం ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేశారు. సంజీవని బస్సును పరీక్షల నిర్వహణకు పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. రోజుకు 150 వరకు నమూనాలు తీసే సౌకర్యం ఉందని డీఎంహెచ్‌వో చెంచయ్య తెలిపారు. వృద్ధులు, మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సామాజిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పరీక్షలు నిర్వహించుటకు చర్యలు చేపట్టామన్నారు. కరోనా లక్షణాలు కలిగిన వారు తక్షణం పరీక్షలు చేయించుకొనుటకు ముందుకు రావాలని డీఎంహెచ్‌వో పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details