ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా భయం.. అంబేద్కర్ భవనంలోనే తలదాచుకున్నారు. - టెక్కలి అంబేద్కర్ భవనంలో పారిశుద్ధ్య కార్మికులు తాజా వార్తలు

మనుషులు మానవత్వం మరవడమంటే ఇదే! వారు ఒకరికి సాయం చేయరు..చేసినవారిని చిన్నచూపు చూస్తారు. కనీసం కృతజ్ఞతాభావం చూపించకుండా..కొన్నిసార్లు కర్కశత్వం ప్రదర్శిస్తుంటారు. అలాంటిదే ఈ అమానవీయ ఘటన.. కరోనా మృతునికి అంత్యక్రియలు నిర్వహించారని పారిశుద్ధ్య కార్మికులను స్థానికులు వీధిలోనికి రానివ్వలేదు. పాపం వారు మూడురోజులుగా అంబేద్కర్ భవనం అరుగుపైనే తలదాచుకుంటున్నారు. అప్పటినుంచి తిండిలేక, నీరులేక అవస్థలు ఎదుర్కొంటున్నారు.

sanitation workers staying at front of ambedkar building in tekkali since three days  due to corona
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో పారిశుద్ధ్య కార్మికులు

By

Published : Jul 6, 2020, 8:15 PM IST

శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో పారిశుద్ధ్య కార్మికులు

కరోనా మృతుల అంత్యక్రియలను చేసేందుకు కుటుంబ సభ్యులే పట్టించుకోకపోయినా, స్థానికులు సహాయపడకపోయినా పారిశుద్ధ్య కార్మికులే మేమున్నామంటూ ముందుకొస్తారు. అన్నీ తామై ఇంట్లో వ్యక్తుల్లాగా దహనసంస్కారాలు నిర్వహిస్తారు. అలాంటివారిని కరోనా అపోహలతో వీధిలోని రానివ్వలేదు స్థానికులు. మావీధిలోకి వస్తే కరోనా వస్తుందని.. వారిని అంటరానివారిలా చూసారు. చేసేదిలేక వారు మూడురోజుల నుంచే ఓ అరుగుపైనే తలదాచుకుంటున్నారు.

శ్రీకాకుళం జిల్లా.. టెక్కలిలో కరోనాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలు చేసిన పారిశుద్ధ్య కార్మికులు కష్టాలు అనుభవిస్తున్నారు. వీరిని స్థానికులు వీధిలోకి రానివ్వలేదు. వారు అప్పటినుంచి మూడు రోజులుగా స్థానిక అంబేద్కర్ భవన్ అరుగు పైనే తలదాచుకుంటున్నారు. మూడు రోజుల క్రితం మెళియాపుట్టి మండలంలో కరోనాతో మృతి చెందిన రోగిని ఖననం చేసే కార్యక్రమంలో అధికారుల సూచనమేరకు టెక్కలికి చెందిన ఇద్దరు, సంతబొమ్మాళి మండలానికి చెందిన నలుగురు కార్మికులు పాల్గొన్నారు. పీపీఈ కిట్లు ధరించి పాల్గొన్నప్పటికీ స్థానికులు అపోహలతో.. వీరిని దూరం పెట్టారు.

దీంతో పోలీసులు వీరిని అంబేద్కర్ భవనానికి తరలించారు. మూడు రోజులుగా తమకు ఆహారం అందడం లేదని, దాహంతో అలమటిస్తున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తంచేశారు. విషయం తెలుసుకున్న టెక్కలికి ఎస్సై గణేష్ ఈ సమస్యను.. ఆర్డీవో ఈట్ల కిశోర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వీరిని స్థానికంగా ఉన్న వసతి గృహానికి తరలించారు.

ఇదీ చూడండి. నీటి కోసం వెళ్లారు... తిరిగిరాని లోకాలకు చేరారు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details