SANITARY INSPECTOR SUICIDE ATTEMPT: శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపల్ కమిషనర్ రాజగోపాల్.. విధులకు వచ్చినా తనకు హాజరు వేయకపోవడంతో పాటు మానసికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ పారిశుద్ధ్య ఇన్స్పెక్టర్ శివలక్ష్మి ఆత్మహత్యకు యత్నించారు. బ్లేడుతో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, అందరిలోనూ అదే పనిగా తిడుతుంటారని.. ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజులు సెలవు పెట్టి వాళ్ల అమ్మని చూడడానికి గుడివాడ వెళ్లినట్లు తెలిపిన ఆమె.. ఇవాళ కార్యాలయానికి వచ్చినా హాజరు వేయలేదని తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్‌కి చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో మనస్తాపం చెందిన శివలక్ష్మి చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు.
ఆఫీసుకు వచ్చినా హాజరు వేయలేదని.. పారిశుద్ధ్య ఇన్స్పెక్టర్ ఆత్మహత్యాయత్నం - పలాస కాశీబుగ్గ మున్సిపల్ కమిషనర్ రాజగోపాల్
SANITARY INSPECTOR SUICIDE ATTEMPT: విధులకు వచ్చినా తనకు హాజరు వేయలేదని మనస్తాపం చెందిన పారిశుద్ధ్య ఇన్స్పెక్టర్ శివలక్ష్మి ఆత్మహత్యకు యత్నించారు. ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, అందరిలోనూ అదే పనిగా తిడుతుంటారని.. ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.
SANITARY INSPECTOR SUICIDE ATTEMPT