శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలోని నాగావళి తీరంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఉదయం వేళల్లో వాహనాలతో పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అధికారులు చూసీ చూడనట్లు ఉండడం, అక్రమ రవాణా దారులు మరింత రెచ్చిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయం తహశీల్దారు గణపతి దృష్టికి తీసుకెళ్లగా అక్రమార్కులని వదిలేది లేదని, చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నాగావళిని తవ్వేస్తున్న ఇసుకాసురులు - నాగావళి తీరంలో ఇసుక అక్రమ రవాణా వార్తలు
శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో ఇసుక అక్రమ రవాణాదారులు రెచ్చిపోతున్నారు. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో ఇసుక అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది.
నాగావళిని తవ్వేస్తున్న ఇసుకాసురులు