ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాలకొండ అభివృద్ధే ధ్యేయంగా పోరాటం

పాలకొండ జిల్లా అభివృద్ధే లక్ష్యంగా జిల్లా సాధన సమితి పోరాటం చేస్తోందని ఆ సమితి అధ్యక్షుడు బుడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వెనుకబడిన ప్రాంతంగా పాలకొండ గుర్తింపు పొందిందని అన్నారు. కనీసం జిల్లాల విషయంలోనైనా పాలకులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

sadhana samithi protest
పాలకొండ అభివృద్ధే ధ్యేయంగా పోరాటం

By

Published : Dec 1, 2020, 5:34 PM IST

పాలకొండ జిల్లా అభివృద్ధే ధ్యేయంగా పోరాటం చేస్తున్నామని జిల్లా సాధన సమితి అధ్యక్షుడు బుడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు సాధన సమితి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ ధర్నా నిర్వహించారు. ముందుగా కోట దుర్గమ్మ ఆలయం కూడలి నుంచి బహిరంగ ప్రదర్శన ఆర్డీవో కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో వెనుకబడిన ప్రాంతంగా పాలకొండ గుర్తింపు పొందిందని జిల్లా సాధన సమితి అధ్యక్షుడు బుడ్డి అప్పలనాయుడు అన్నారు. కనీసం జిల్లాల విషయంలోనైనా పాలకులు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్​ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసమే జిల్లాల విభజన చేయనున్నట్లు ప్రకటించారు... కావునా పాలకొండకు న్యాయం చేయాలని కోరారు.

ఆ ప్రాంత ప్రజల మనోభావాలను అధికారులు , ప్రజా ప్రతినిధులు , ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలటం కోసం ఆందోళన చేస్తున్నట్లు వివరించారు. పాలకొండ జిల్లా సాధన కోసం పార్టీలకతీతంగా కృషి చేస్తామని... అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండీ...

కొప్పర్తి పారిశ్రామిక క్లస్టర్​ పరిశ్రమలకు ప్రోత్సాహకాల ప్రత్యేక ప్యాకేజీ

ABOUT THE AUTHOR

...view details