ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంచాయతీ పోరులో 'తమ్మినేని' వారి కోడళ్లు..!

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో రాజకీయం రసవత్తరంగా మారింది. స్పీకర్ తమ్మినేని కుటుంబం నుంచి ఇద్దరు మహిళలు పోటీలో ఉంటున్నారు. వీరు తోటికోడళ్లు కావడం విశేషం. సభాపతి తమ్మినేని సీతారాం సతీమణి వాణిని వైకాపా బలపర్చగా.. ఆయన చిన్న వదిన భారతిని తెదేపా బలపర్చింది. సీతారాం పెద్ద వదిన... వాణికి మద్దతు ఇవ్వడం అమదాలవలసలో చర్చకు దారి తీసింది. చాలా ఏళ్లుగా తమ్మినేని కుటుంబసభ్యులే తొగరం పంచాయతీని పాలించడం గమనార్హం.

పంచాయతీ పోరులో 'తమ్మినేని' వారి కోడళ్లు..!
పంచాయతీ పోరులో 'తమ్మినేని' వారి కోడళ్లు..!

By

Published : Feb 8, 2021, 3:24 PM IST

Updated : Feb 8, 2021, 6:16 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తొగరం పంచాయతీ సర్పంచి పదవికి తోటికోడళ్లు పోటీ పడుతున్నారు. శాసనసభాపతి తమ్మినేని సీతారాం సతీమణి తమ్మినేని వాణి... వైకాపా బలపర్చిన అభ్యర్థిగా పోటీకి నామినేషన్ దాఖలు చేశారు. ఆమెకు మద్దతుగా సీతారాం పెద్ద వదిన తమ్మినేని శారద నిలిచారు. తొగరంలో తెదేపా బలపర్చిన సర్పంచి అభ్యర్థిగా సభాపతి చిన్న వదిన తమ్మినేని భారతి నామినేషన్ దాఖలు చేశారు. తమ్మినేని భారతి రెండు పర్యాయాలు ఎంపీపీగా పనిచేశారు. ఆమె భర్త శ్యామలరావు ఎంపీపీగా, జడ్పీటీసీ పదవులు చేపట్టారు.

ఈసారి పంచాయతీ ఎన్నికల్లో తోటి కోడళ్ల పోరు బలంగా ఉండడంతో విజయం ఎవరిని వరిస్తుందో అనే చర్చ జరుగుతోంది. తమ్మినేని సీతారాం సతీమణి సర్పంచి పదవికి నామినేషన్ వేయడంతో అక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది. ఏదేమైనా తొగరం సర్పంచి పదవి మాత్రం తమ్మినేని కుటుంబాన్నే వరిస్తోంది.

ఇదీ చదవండి:

ఎన్నవాడలో సర్పంచి అభ్యర్థి గృహనిర్భందం

Last Updated : Feb 8, 2021, 6:16 PM IST

ABOUT THE AUTHOR

...view details