ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళంలో రన్ ఫర్ యూనిటీ ర్యాలీ - శ్రీకాకుళంలో రన్ ఫర్ యూనిటీ ర్యాలీ వార్తలు

విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ అందరం ఐక్యతతో మెలగాలని.. శ్రీకాకుళం ఎస్పీ అమిత్ బర్దార్ అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా శ్రీకాకుళంలో రన్ ఫర్ యూనిటీ ర్యాలీ నిర్వహించారు.

run for unity rally in srikakulam
శ్రీకాకుళంలో రన్ ఫర్ యూనిటీ ర్యాలీ

By

Published : Oct 26, 2020, 2:15 PM IST

పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ... శ్రీకాకుళంలో రన్‌ ఫర్‌ యూనిటీ ర్యాలీని ఎస్పీ అమిత్ బర్దార్ ప్రారంభించారు. 7 రోడ్ల కూడలి నుంచి జిల్లా పోలీసు కార్యాలయం వరకు పరుగు సాగింది. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా.. జిల్లా పోలీసు అధికారులతో పాటు సిబ్బంది, కళాశాల విద్యార్థులు పాల్గొని అమరవీరులకు జోహార్లు తెలిపారు.

ప్రజా శ్రేయస్సు, రాష్ట్ర, దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలు స్మరించుకుంటూ.. ఈ ఐక్యత పరుగు నిర్వహించామని ఎస్పీ తెలిపారు. విధి నిర్వహణలో అసువులు బాసిన వారికి, వారి వీరోచిత పోరాట ప్రతిమకు,వారి మహోన్నతమైన త్యాగాలకు గుర్తుగా.. మనమంతా ఐక్యతతో బలమైన జాతి నిర్మాణం చేపట్టాలని ఎస్పీ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details