యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు సరికాదని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు వాసవి కృష్ణమూర్తి పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఆర్టీసీ డిపో ఎదురుగా శుక్రవారం మధ్యాహ్నం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అక్రమంగా సస్పెండ్ చేసిన ఏడీసీ రావును తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొన్ని సర్వీసులను కార్మికులు వ్యతిరేకిస్తున్నప్పటికీ ఏకపక్షంగా వ్యవహరించటం సరికాదన్నారు. ఇదే విధంగా కొనసాగితే సమ్మె తప్పదని హెచ్చరించారు.
యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు సరికాదు
శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఆర్టీసీ డిపో ఎదురుగా ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆర్టీసీ