లాక్డౌన్ నేపథ్యంలో 30 రోజులుగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు రోడ్డు మీదకు వచ్చాయి. ఏపీ మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ రమణి అభ్యర్ధన మేరకు... మొక్కజొన్న విత్తనాల రవాణా నిమిత్తం పాలకొండ డిపో నుంచి ఈరోజు 10 బస్సులు ఏర్పాటు చేశారు. రేగడి, ఆమదాలవలస, వంగర, సంతకవిటి, వీరఘట్టం మండలాల నుంచి గోడౌన్ వద్దకు మొక్కజొన్న విత్తనాలు ఆర్టీసీ బస్సులో తరలించారు. రాజాం, కొత్తూరు, ఎల్ ఎన్ పేట మండలాల నుంచి విత్తనాల రవాణా రేపటి నుంచి కొనసాగుతుంది.
లాక్డౌన్... రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు..!
మొక్కజొన్న విత్తనాల రవాణా కోసం శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఆర్టీసీ డీపో నుంచి 10 బస్సులు ఏర్పాటు చేశారు. ఏపీ మార్కెట్ ఫెడ్ జిల్లా మేనేజర్ రమణీ అభ్యర్థన మేరకు ఈ ఏర్పాట్లు చేసినట్లు డిపో మేనేజర్ మూర్తి తెలిపారు.
rtc bus in sirkakulam dst are use for filed transport