దళితులపై దాడులు అడ్డుకోవాల్సిన అధికారులు, కేసులు తారుమారు చేయడం సరికాదని... జిల్లా సామాజిక న్యాయ పోరాట సమితి ప్రధాన కార్యదర్శి డి.గణేష్ మండిపడ్డారు. శ్రీకాకుళంలోని అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో జిల్లా దళిత సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కాజీపేటకు చెందిన దళితుడు చల్ల ఆనంద్ కుమార్ పై, అగ్రకుల పెత్తందార్లు కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఆయన ఆరోపించారు. ఆనంద్‌కుమార్‌ను దారుణంగా కొట్టడానికి గల కారణం.. బీసీ కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించడమేనన్నారు. దాడి జరిగి 22 రోజులు గడుస్తున్నా దర్యాప్తు అధికారిగా రావలసిన డీఎస్పీ నేటికీ రాకపోవడం అనుమానాలకు తావిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
దళిత సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం
కాజీపేటకు చెందిన దళితుడు చల్ల ఆనంద్ కుమార్ పై దాడిని ఖండిస్తూ శ్రీకాకుళంలోని అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో జిల్లా దళిత సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బీసీ కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడన్న కారణంగా ఆనంద్‌కుమార్‌పై దాడి చేశారని ఆరోపించారు.
దళిత సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం