Roads damaged due to rain in Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో చోరుపల్లి, గెద్రజోల గ్రామాల మధ్యలో రహదారి బీటలు వారి పెద్ద గోతులు ఏర్పడ్డాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు 80 మీటర్ల మేర రహదారి, పంట పొలాల్లో భూమి బీటలు వారింది. స్థానికులు భూకంపం వచ్చిందేమోనని ఆందోళన చెందారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. వరుస వర్షాలకు కొండవాలు ప్రాంతం కుంగిందని.. ప్రాథమికంగా నిర్ణయానికొచ్చారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తున్నట్లు చెప్పారు. మరమ్మతులు చేయించేందుకు చర్యలు చేపడుతున్నట్లు జేఈఈ శ్రీనివాసరావు తెలిపారు.
Roads Damaged in Parvathipuram : మన్యంలో భూమికి బీటలు.. భూకంపం అంటూ ఆందోళన చెందిన గిరిజనులు - Parvathipuram Manyam
Roads damaged due to rain: ఆ ప్రాంతలో ఒక్కసారిగా రోడ్లు కుంగిపోవడం మెుదలైంది. ఈ పరిణామంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు వెల్లడించారు. ఈ ఘటనతో ఆయా గ్రామాలకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నట్లు పేర్కొన్నారు.
మన్యంలో భూమి బీటలు భూకంపం అంటూ ఆందోళన
Last Updated : Oct 13, 2022, 12:14 PM IST