వోల్వో బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సమీపంలోని ఒడిశా భూభాగమైన సవరదేవిపేట జాతీయ రహదారిపై జరిగింది. ఇచ్ఛాపురానికి చెందిన టెంక లోకేష్ (38), మహమ్మద్ అమరుదున్ (25) ద్విచక్రవాహనంపై సవరదేవిపేట వద్ద జాతీయ రహదారి దాటే క్రమంలో.. వేగంగా వచ్చిన వోల్వా బస్సు వారిని ఢీకొట్టింది.
బైక్పై వెళ్తున్న టెంక లోకేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మహమ్మద్ అమరదున్ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని 108 వాహనంలో ఇచ్ఛాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం బరంపురం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.