రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన ఘటన శ్రీకాకుళం జిల్లా సోంపేట సమీపంలో జరిగింది. ఒడిశాలోని పాత్రపురం గలగుండ గ్రామానికి చెందిన భగవాన్ సోయా అతని భార్య భారతీ సోయాతో కలిసి ద్విచక్రవాహనంపై సోంపేట నుంచి కొర్లం వైపు వెళ్తుండగా వీరి వాహనాన్ని వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం - road accident
శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన దంపతులు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టడం వల్ల ఈ ఘటన జరిగింది.

రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం