ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆసరాగా ఉందామనుకున్నారు... అనంత లోకాలకు వెళ్లిపోయారు - brother and sister died in kosta accident

ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి, తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలనుకున్నారా అన్నాచెల్లెళ్లు. ఆ ఉద్దేశ్యంతోనే అమ్మానాన్నలకు దూరంగా విశాఖలో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్న వారిపై విధి కన్నెర్ర జేసింది. రోడ్డు ప్రమాదం రూపంలో వారిద్దరి ఉసురు తీసింది. ఈ విషాదకర ఘటన శ్రీకాకుళం జిల్లా కోష్ఠి జాతీయ రహదారి సమీపంలో జరిగింది.

road accident in kosta
లారీని ఢీ కొట్టిన కారు... అన్నాచెల్లెళ్లు మృతి

By

Published : May 11, 2020, 11:10 AM IST

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం జాతీయ రహదారి కోష్ఠి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెళ్లు అక్కడికక్కడే మృతి చెందారు.

మందస మండలం చిన్న నారాయణపురం గ్రామానికి చెందిన అన్నాచెల్లెళ్లు మడియా ఢిల్లీశ్వరరావు, వసంతలు ప్రభుత్వ ఉద్యోగం సాదించేందుకు కోచింగ్​ కోసమని విశాఖపట్నంలో మామయ్య ఇంటి వద్ద ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారు.

లాక్​డౌన్ కారణంగా పోటీ పరీక్షలు వాయిదా పడటంతో ప్రభుత్వ అనుమతి తీసుకొని అద్దె కారులో మామయ్య కూతురు కుసుమతో కలిసి స్వస్థలానికి బయలుదేరారు. కోష్ఠి వద్దకు వచ్చేసరకి ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టటంతో అన్నాచెల్లెళ్లు ఇద్దరూ అక్కడే మృతి చెందగా, కారు డ్రైవర్ కార్తీక్, కుసుమ ప్రాణాలతో బయటపడ్డారు.

ఇదీ చదవండి:వైకాపా వర్గీయుల బాహాబాహీ.. 10 మందికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details