ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డివైడర్​ను ఢీ కొన్న బస్సు.. పలువురికి గాయాలు - శ్రీకాకుళం జిల్లా రోడ్డు ప్రమాదం తాజా వార్తలు

విశాఖ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న బస్సు ఇచ్ఛాపురం టోల్​ ప్లాజా వద్ద డివైడర్​పై ఉన్న దిమ్మను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలు.. అందులో నలుగురికి తీవ్రగాయాలు.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను అసుపత్రికి తరలించారు.

road accident at ichapuram
డివైడర్​ను ఢీ కొన్న బస్సు.. పలువురికి గాయాలు

By

Published : Jan 26, 2021, 10:55 AM IST

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం టోల్​ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న బస్సు టోల్​ ప్లాజా వద్ద డివైడర్​పై ఉన్న దిమ్మను ఢీ కొట్టింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలు కాగా.. అందులో 4 తీవ్ర గాయాలు.. ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. వెంటానే క్షతగాత్రులను ఇచ్చాపురం సామాజిక ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.

మెరుగైన చికిత్స కోసం బ్రహ్మపుత్రకు తరలించారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున 3 గంటలకు కావటంతో డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వలన ఈ ఘటన జరిగిందన్నారు. సంఘటనా స్థలానికి స్థానిక ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details