శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం గుండువిల్లిపేట సమీపంలో లారీ ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రేవు అంపలాం గ్రామానికి చెందిన గిన్ని రాజేశ్వరరావు.. తన భార్య రజనీతో కలిసి ద్విచక్ర వాహనంపై శ్రీకాకుళం బయలుదేరారు. ఇదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో రాజేశ్వరరావు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వీరికి పెళ్లై పట్టుమని ఏడాది కూడా కాలేదు. తన కళ్లెదుటే భర్త చనిపోవడం చూసిన భార్య రజని కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రమాదంపై నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లారీ ఢీకొని వ్యక్తి మృతి.. - గుండువిల్లిపేటలో రోడ్డు ప్రమాదం
వారికి వివాహం జరిగి పట్టుమని ఏడాది కూడా కాలేదు. ఇంతలోనే విధి వక్రించింది. తన భార్యను ద్విచక్రవాహనంపై ఆస్పత్రికి తీసుకెళ్తుండగా లారీ ఢీ కొని ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన ఘటన వివరాలివి..!

శ్రీకాకుళంలో లారీ ఢీకొని వ్యక్తి మృతి