ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రామ దేవతల ఉత్సవాలపై ఆంక్షలు... రావులవలసలో ఉద్రిక్తత - రావులవలస గ్రామ దేవత ఉత్సవాలపై ఆంక్షలు

గ్రామ దేవత ఉత్సవాలకు పోలీసులు అడ్డుచెప్పిన కారణంగా.. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం రావులవలస గ్రామంలో ఉద్రిక్తత తలెత్తింది. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

గ్రామ దేవత ఉత్సవాలపై ఆంక్షలు
గ్రామ దేవత ఉత్సవాలపై ఆంక్షలు

By

Published : Oct 27, 2020, 7:56 PM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం రావులవలస గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామ దేవత ఉత్సవాలపై పోలీసులు ఆంక్షలు విధించిన కారణంగా... గ్రామస్తులు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. నిరాడంబరంగా ఉత్సవాలు నిర్వహించుకోవాలని పోలీసులు చెప్పగా... గ్రామస్తులు అంగీకరించలేదు.

పూర్వీకుల నుంచి వస్తున్న ఆనవాయితీ ప్రకారం ఉత్సవాలు నిర్వహిస్తామని స్థానికులు పట్టుబట్టారు. దిగొచ్చిన పోలీసులు శాంతియుతంగా ఉత్సవాలు చేసుకోవాలని సూచించారు. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details