TDP Flexi Issue: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రధాన రహదారిపై తెలుగుదేశం జెండాల తొలగింపు వివాదానికి దారితీసింది. తెదేపా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గతంలో రోడ్డుకు ఇరువైపులా జెండాలు కట్టారు. అయితే.. వాటికి అనుమతులు లేవంటూ మూడు రోజుల క్రితం తొలగించేందుకు పంచాయతీ అధికారులు ప్రయత్నించారు. తెదేపా నాయకుల అభ్యంతరంతో వెనక్కి తగ్గిన అధికారులు.. గత రాత్రి మళ్లీ రంగంలోకి దిగారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ.. పార్టీ నేతలతో కలిసి వెళ్లి అభ్యంతరం తెలిపారు. ఇతర పార్టీల ఫ్లెక్సీలు ఉన్నప్పుడు.. తెదేపావే ఎందుకు తొలగిస్తున్నారని నిలదీశారు. ఈ దశలో అధికారులు తొలగింపు చర్యలు విరమించుకున్నారు.
తెదేపా జెండాలు తొలగించేందుకు యత్నం.. పార్టీ శ్రేణుల ఆందోళన
TDP Flexi Issue: ప్రధాన రహదారిపై ఉన్న తెలుగుదేశం జెండాల తొలగింపు వివాదానికి దారి తీసింది. తెదేపా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గతంలో రోడ్డుకు ఇరువైపులా కట్టారు. అయితే వాటికి అనుమతులు లేవంటూ.. మూడు రోజుల క్రితం తొలగించేందుకు పంచాయతీ అధికారులు ప్రయత్నించారు. ఇదీ శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో జరిగింది.
వివాదానికి దారితీసిన తెలుగుదేశం జెండాల తొలగింపు