ఎన్ని ప్రభుత్వాలు మారినా... గిరిజనుల రాతలు మాత్రం మారటం లేదని చెప్పేందుకు ఇదొక సాక్ష్యం. 21 ఏళ్ల గిరిజన యువకుడు అనారోగ్యంతో చనిపోతే, అతడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు సరైన రోడ్డు మార్గం లేదు. దీంతో చేసేదిమి లేక మంచంపైన మృతదేహాన్ని మోసుకొని వెళ్లారు. ఈ హృదయవిదారక ఘటన శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం చందనగిరిలో జరిగింది.
మంచంపై మృతదేహం... 4 కిలోమీటర్ల పయనం... - meliyaputti dead body carry on bed
చంద్రమండలం పైకి మనుషులు పంపిస్తున్న ఈ రోజుల్లో... ఓ యువకుడి మృతదేహాన్ని తరలించటానికి సరైన రహదారి లేక... మంచంపైనే 4 కిలోమీటర్లు మోసుకొని స్వస్థలానికి తీసుకువెళ్లిన ఘటన ఇది.

శ్రీను మృతదేహాన్ని మంచంపై తీసుకవెళ్తున్న బంధువులు
చందనగిరి గ్రామానికి చెందిన శ్రీను అనే 21 ఏళ్ల యువకుడు అనారోగ్యంతో విశాఖలో మృతి చెందాడు. అక్కడ నుంచి ఆ యువకుడి మృతదేహాన్ని వీరన్నపేట వరకు అంబులెన్స్‌లో తీసుకువచ్చారు. చందనగిరికి సరైన రహదారి సౌకర్యం లేకపోవటంతో.. వీరన్నపాలెం నుంచి మృతదేహాన్ని మంచంపైనే 4 కిలోమీటర్లు మోసుకుంటూ తీసుకువెళ్లారు. పైగా ఆ ప్రాంతమంతా కొండ ప్రాంతం కావటంతో మృతదేహాన్ని గ్రామానికి తీసుకువెళ్లేందుకు బంధువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.