ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెద్దలకు సామాజిక దూరం వర్తించదా? - covid -19 news in srikakulam district

శ్రీకాకుళం జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా ప్రజలకు జాగ్రత్తలు చెప్పాల్సిన అధికారులే వాటిని పాటించటం లేదు. లావేరు మండలం బొంతుపేటకు చెందిన రెడ్డి గన్నయ్య జేసీ-2 గా పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా గ్రామంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కరోనా విజృంభిస్తోన్న తరుణంలో ఈ సభకు హజరైన పెద్దలే సామాజిక దూరం, మాస్కులు ధరించకపోవటం చర్చనీయాంశమైంది.

పెద్దలకు సామాజిక దూరం వర్తించదా?
పెద్దలకు సామాజిక దూరం వర్తించదా?

By

Published : Jun 10, 2020, 8:15 AM IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ సామాజిక దూరం, మాస్క్​లు,తదితర అంశాలపై ప్రజలకు చెప్పాల్సిన పెద్దలే బాధ్యతను మరిచారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండంలం బొంతుపేట గ్రామానికి చెందిన రెడ్డి గన్నయ్య జేసీ-2గా ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఆయనకు స్వగ్రామంలో సన్మానసభ ఏర్పాటు చేశారు.

శాసనసభాపతి తమ్మినేని సీతారాం, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే కిరణ్ కుమార్ ముఖ్య అతిథిలుగా హజరయ్యారు. వీరితో పాటుగా వందల మంది గుంపుగుంపులుగా చేరి కార్యక్రమం నిర్వహించారు. చాలా మంది మాస్కులు కూడా ధరించలేదు. భౌతిక దూరం పాటించలేదు. కరోనా కాలంలో రాష్ట్ర పెద్దలే సామాజిక బాధ్యత పాటించకపోవటం చర్చనీయాంశమైంది.

ABOUT THE AUTHOR

...view details