శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం జానకిపురం గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో 6 ఇళ్లు ఆహుతయ్యాయి. ప్రమాద బాధితులకు శ్రీకాకుళం రెడ్ క్రాస్ సంస్థ నిత్యవసర వస్తువులు, బట్టలు, దుప్పట్లను.. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, రాష్ట్ర వైకాపా యువజన కార్యదర్శి, కాలింగ్ కార్పొరేషన్ చైర్మన్ పంపిణీ చేశారు. అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వం ఆదుకుని.. అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. తమకు ప్రభుత్వం తరఫున ఇల్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యేను బాధితులు కోరారు.
అగ్ని ప్రమాద బాధితులకు అండగా రెడ్ క్రాస్ - శ్రీకాకుళం జిల్లా వార్తలు
శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాద బాధితులకు రెడ్ క్రాస్ సంస్థ అండగా నిలిచింది. నిత్యావసర సరకులు, దుప్పట్లు అందించింది. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగుల చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

శ్రీకాకుళం అగ్ని ప్రమాద బాధితులకు 'రెడ్ క్రాస్' సాయం..