శ్రీకాకుళం జిల్లా వంశధార నదిలో నీటిమట్టం పెరుగుతోంది. పరివాహక ప్రాంతాలను ఆర్డీవో పరిశీలించారు. నరసన్నపేట మండలం గడ్డవారిపేట, చోడవరం, కామేశ్వరీపేట గ్రామాల్లో పర్యటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
భారీ వర్షాల కారణంగా బయటకు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. నిత్యవసర సరుకులు అందుబాటులో ఉండేలా చూడాలని గ్రామ స్థాయి అధికారులకు ఆర్డీవో సూచించారు. ఆయనతోపాటు తహసీల్దార్, ఇతర అధికారులు గ్రామాల్లో పర్యటించారు.