శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం రావులవలస గ్రామస్థులు ఆందోళన నిర్వహించారు. తమ గ్రామానికి రహదారి సదుపాయం కల్పించాలంటూ డిమాండ్ చేశారు. ఈనెల 1న జాతీయ రహదారి నుంచి రావులవలస గ్రామానికి వెళ్లే రహదారిపై 11 ఆర్ కిల్లం కాలువపై వంతెన కుప్పకూలిపోయింది. వారం రోజులవుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో.. రవాణా స్తంభించిందని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
'వంతెన కూలి వారమైనా.. పట్టించుకున్న నాథుడే లేడయే'
తమ గ్రామానికి రహదారి సదుపాయం కల్పించాలంటూ శ్రీకాకుళం జిల్లా రావులవలస గ్రామస్థులు ధర్నా చేశారు. ఈ నెల 1వ తేదీన గ్రామానికి వెళ్లే మార్గంలో వంశధార కాలువపై ఉన్న వంతెన కుప్పకూలడంతో.. రాకపోకలు నిలిచిపోయాయి. తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
రావుల వలస గ్రామస్థులు నిరసన