ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సిగ్నల్ సమస్య... నిలిచిపోయిన రేషన్ బియ్యం పంపిణీ - amada;lavasa

బయో మెట్రిక్ యంత్రంలోని సాంకేతిక సమస్యతో శ్రీకాకుళం జిల్లా కృష్ణాపురంలో రేషన్ బియ్యం పంపిణీ నిలిచిపోయింది. సిగ్నల్స్ లేక లబ్ధిదారులందరికీ పంపిణీ చేయలేకపోతున్నామని వాలంటీర్లు తెలిపారు.

సిగ్నల్ సమస్య... నిలిచిపోయిన రేషన్ బియ్యం పంపిణీ

By

Published : Sep 8, 2019, 4:42 PM IST

సిగ్నల్ సమస్య... నిలిచిపోయిన రేషన్ బియ్యం పంపిణీ

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస కృష్ణాపురం రెండోవార్డులో పైలెట్ ప్రాజెక్ట్ ద్వారా రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే యంత్రంలోని సాంకేతిక సమస్యలతో బియ్యం పంపిణీ నిలిచిపోయింది. రేషన్‌ సరుకులు పంపిణీ చేస్తున్న వాలంటీర్లు.. బయోమెట్రిక్‌ యంత్రాలు మొరాయించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిగ్నల్ సమస్యతో 500 మంది వినియోగదారులకు కేవలం 50మందికి మాత్రమే పంపిణీ చేసినట్లు వాలంటీర్లు తెలిపారు. త్వరలోనే సిగ్నల్ సమస్యను పరిష్కరించి పూర్తిస్థాయిలో రేషన్ పంపిణీ చేస్తామని తహశీల్దార్‌ రాంబాబు స్పష్టం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details