తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని శ్రీకాకుళం జిల్లా రాజాంలో డీలర్లు ర్యాలీ చేశారు. అంబేద్కర్ కూడలి నుంచి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు ఈ ర్యాలీ సాగింది. అనంతరం వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్నో ఏళ్లగా డీలర్లు ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు . రాష్ట్రంలో 29 వేల 500 మంది డీలర్లు పనిచేస్తున్నారని... వీరి పొట్ట కొట్టడం భావ్యం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థను కొనసాగించి వృత్తి భద్రత కల్పించాలని కోరారు. ఈ మేరకు... తహశీల్దార్కు వినతి పత్రం అందించారు.
శ్రీకాకుళంలో రేషన్ డీలర్ల ఆందోళన - రేషన్ డీలర్ల ఆందోళన
ప్రభుత్వం రేషన్ డీలర్ల వ్యవస్థను రద్దు చేస్తుందన్న వార్తలపై చౌక ధరల దుకాణ డీలర్లంతా కలసి శ్రీకాకుళం జిల్లాలో ర్యాలీ చేశారు. వైకాపా గెలుపులో తమ ప్రోత్సాహమూ ఉందనీ... వ్యవస్థను రద్దు చేయొద్దనీ డిమాండ్ చేశారు.
![శ్రీకాకుళంలో రేషన్ డీలర్ల ఆందోళన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3782626-261-3782626-1562593483658.jpg)
ర్యాలీ చేస్తున్న రేషన్ డిలర్లు