ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా... కన్నుల పండువగా రథ సప్తమి వేడుకలు - Ratha Saptami celebrations in temples across ap

Ratha Saptami celebrations: రథసప్తమి పర్వదినాన... రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఉదయం నుంచే భక్తులు దేవాలయాలకు పోటెత్తగా.. జనసంద్రంగా మారిపోయాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో... ప్రత్యేక పూజలు, హోమాలతో వైభవంగా రథసప్తమి వేడుకలు జరిగాయి.

Ratha Saptami celebrations
రథ సప్తమి వేడుకలు

By

Published : Jan 28, 2023, 11:00 PM IST

Ratha Saptami celebrations in AP: శ్రీకాకుళంలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆదిత్యుడి నిజరూపదర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరులోని సూర్యదేవాలయానికి భక్తులు పోటెత్తారు. విశాఖ సాగరతీరంలో కంచి పీఠాధిపతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింహాద్రి అప్పన్న సన్నిధిలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు సూర్యదేవాలయం కిక్కిరిసిపోయింద. కృష్ణా జిల్లా చిక్కవరంలోని స్వామికి హోమాలు, శాంతి కల్యాణం వైభవోపేతంగా నిర్వహించారు. నెల్లూరులోని శ్రీతల్పగిరి రంగనాధస్వామికి...ప్రత్యేక పూజలు చేశారు.

విశాఖ సింహాచలం వైభవంగా సింహాద్రి అప్పన్న సన్నిధిలోరథసప్తమి వేడుకలు సూర్యనారాయణ స్వామి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న స్వామివారు స్వామివారి ఉత్సవాల్లో ప్రధానమైన ఉత్సవం ఈ రథసప్తమి ఉత్సవం ముందుగా స్వామివారికి సుప్రభాత సేవతో మేలుకొలుపు విశేష పూజలు నిర్వహించి అనంతరం స్వామివారి పురాతన రాతిరథంపై అధిష్టింపజేసి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు పండితులు పండిత పారాయణం నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు స్వామి వారు సూర్యనారాయణ స్వామి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు

కృష్ణాజిల్లా గన్నవరం మండలం చిక్కవరం ఆరోగ్య ప్రదాత శ్రీ ఉషా పద్మని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి పాదాలను సూర్యకిరణాలు తాకాయి. శ్రీకాకుళం , చిత్తూరు తర్వాత అత్యంత ప్రసిద్ధి గాంచిన దేవస్థానం చిక్కవరం ఉషా పద్మిని సమేత సూర్యనారాయణ దేవస్థానం ప్రధాన అర్ఛకులు వంశీ ఆధ్వర్యంలో తెల్లవారుజామున నుంచే మూలమూర్తలకు పంచామృతవిశేష అభిషేకం, మూలమూర్తలకు కిరణోత్సవం, సూర్య నమస్కారాలు, అరుణ పారాయణం, ఏకకాలంలో సూర్య హోమం, శాంతి కల్యాణం వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం భక్తలకు అన్న సమారధన నిర్వహించారు. సూర్య కిరణాల దర్శనం కోసం విజయవాడ, గన్నవరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కాక ఇతర రాష్టాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అలయ నిర్మాణ దాత ముక్కామల పండుమ్మ దగ్గరండి భక్తులకు ఏలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.


ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, ఒంగోలు, మార్కాపురంలోని ఆలయాల్లో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. కనిగిరిలోని వెంకటేశ్వరస్వామి వారిని ఏడు వాహనాలపై 7 అవతారాల్లో ఊరేగించారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలోని లక్ష్మీచెన్నకేశవస్వామిని సూర్యప్రభ వాహనంపై ఊరేగించారు. దేవునికడపలోని శ్రీలక్ష్మీవెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా... రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి.

కర్నూలు జిల్లాలోనూ రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పతంజలి సాయి యోగా కేంద్రంలో రధసప్తమి సందర్భంగా సూర్య భగవానుడుకి ప్రత్యేక పూజలు చేసి సూర్య నమస్కారాలు చేశారు.

అనంతపురం జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉరవకొండ మండలం బూదగవిలో వెలసిన శ్రీసూర్యనారాయణ ఆలయంలో రథ సప్తమి సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు తెల్లవారుజామున నుంచే వేలది మంది భక్తులు బారులు తీరారు. స్వామి వారి మూలవిరాట్​కు ప్రత్యేక పూజలు, ఆభిషేకాలు నిర్వహించారు. ఛాయా ఉషా సమేత శ్రీసూర్యనారాయణ కళ్యాణం కన్నుల పండువగా జరిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details