విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోవిందరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల జాతీయ రహదారిపై.. రాస్తారోకో నిర్వహించారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడాన్ని సహించబోమన్నారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే పోరాటాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి ప్రదర్శనగా వెళ్తుండగా.. పోలీసులు అరెస్టు చేసి తరలించారు.