ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉత్కంఠ పోరులో రామ్మోహన్​ నాయుడు విజయం

శ్రీకాకుళం ఎంపీ స్థానానికి ఉదయానికి ఉత్రంఠ వీడింది. పోస్టల్​ బ్యాలెట్​ వివాదం తరువాత దువ్వాడ శ్రీనివాసరావు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తదుపరి ప్రక్రియను కొనసాగిస్తూ పార్లమెంటు అభ్యర్థిగా రామ్మోహన్​నాయుడును దాదాపు 12 గంటల పాటు లెక్కింపు తర్వాత అధికారులు ప్రకటించారు.

ఉత్కంఠ పోరులో రామ్మోహన్​ నాయుడు విజయం

By

Published : May 24, 2019, 9:39 AM IST

శ్రీకాకుళం పార్లమెంటు స్థానం లెక్కింపులో ఉత్కంఠ ఉదయం వరకు కొనసాగింది. పార్లమెంటు అభ్యర్థిగా రామ్మోహన్​ నాయుడు 6,100 ఓట్ల మెజారిటీతో దువ్వాడ శ్రీనివాసరావుపై ఘన విజయం సాధించారు. రామ్మోహన్​నాయుడు గెలుపుపై దువ్వాడ శ్రీనివాసరావు​ అభ్యంతరం వ్యక్తం చేశారు. లెక్కింపుల్లో తిరస్కరించిన పోస్టల్​ బ్యాలెట్​ ఓట్లు మళ్లీ పరిశీలించాలని వైకాపా అభ్యర్థి పట్టుపట్టారు. దీంతో పోస్టల్​ బ్యాలెట్​ ఓట్లు మళ్లీ పరిశీలించారు. ఎన్నికల అధికారులు 7 వేల ఓట్లు రీకౌంటింగ్​ చేయడంతో 6 వేల వంద ఓట్లతో తెదేపా అభ్యర్థి సాధించడంతో వైకాపా అభ్యర్థులు అధికారులపై మండిపడ్డారు. లెక్కింపు ప్రక్రియ పూర్తి కాకముందే అర్ధాంతరంగా శ్రీనివాసరావు అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు. తదుపరి అధికారులు పూర్తి స్థాయిలో లెక్కింపు ప్రక్రియ పూర్తి చేసి...12 గంటల నిరీక్షణ తర్వాత శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా కింజరపు రామ్మోహన్​ నాయుడు గెలుపొందినట్లు ప్రకటించి డిక్లరేషన్​ పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్​ నివాస్​ మాజీ మంత్రి ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడుతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఉత్కంఠ పోరులో రామ్మోహన్​ నాయుడు విజయం

ABOUT THE AUTHOR

...view details