శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవుకు చెందిన మువ్వల నగేశ్.. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే రణస్థలం మండలం సీతంపేట వద్ద అనుమానస్పద స్థితిలో నగేశ్ మృతదేహం లభ్యమైంది.
మృతి పట్ల స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థి మృతికి కారకులైన నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల డిమాండ్ చేశారు. ఈ మేరకు భారీగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.