రాష్ట్ర రాజధాని కోసం అమరావతి రైతులు చేసిన త్యాగాలు గొప్పవని తెదేపా నాయకుడు మాజీ ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి అన్నారు. అమరావతి రైతుల ఉద్యమం 300 రోజులు గడిచిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోసంఘీభావంగా నిరసన ప్రదర్శన చేశారు. అమరావతి రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం తాహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు.
'అమరావతి రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదు' - శ్రీకాకుళంలో అమరావతికి మద్దతుగా ర్యాలీ
రాష్ట్ర రాజధాని కోసం అమరావతి రైతులకు మద్దతుగా శ్రీకాకుళం జిల్లాలో తెదేపా నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. అమరావతి రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదని ప్రభుత్వానికి హెచ్చరించారు.
శ్రీకాకుళంలో అమరావతికి మద్దతుగా ర్యాలీలు
ఆమదాలవలస బూర్జ సరుబుజ్జిలి పొందూరు మండలాల్లో తెదేపా నాయకులు అమరావతి రైతులకు మద్దతుగా తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అమరావతిని నిర్మించేందుకు రైతులు ముందుకు వచ్చి భూములు ఇస్తే వైకాపా ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు తమ్మినేని సుజాత, మాజీ జడ్పీటీసీ నెపు రామకృష్ణ, తెదేపా నాయకులు తమ్మినేని విద్యాసాగర్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: