'ప్లాస్టిక్ నిషేధించాలని అవగాహన ర్యాలీ' - latest news for no plastic rally in sklm
ప్లాస్టిక్ భూతాన్ని అంతమొందించాలని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలంలో స్థానికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కిరణ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. 2020 కల్లా ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ర్యాలీలో వివిధ పాఠశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్లాస్టిక్ నివారణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.