మాస్కులు ధరించకుండా బయటకొచ్చిన వారి చేతిలో కరోనా ప్లకార్డులు పెట్టారు శ్రీకాకుళం జిల్లా రాజాం పోలీసులు. లాక్డౌన్ కారణంగా ఇళ్ల నుంచి నిత్యావసర వస్తువులు కొనుగోలు నిమిత్తం బయటకు వచ్చినప్పటికీ మాస్కులు ధరించడం లేదు. అటువంటి వారిని అంబేడ్కర్ కూడలి వద్ద నిలబెట్టి ప్లకార్డులు ఇచ్చి ప్రదర్శన చేయించారు. ప్లకార్డులపై కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.
మాస్క్ లేకుండా బయటకొస్తే ప్లకార్డు పట్టుకోవాలి... - రాజాం తాజా కొవిడ్ వార్తలు
రాజాంలో మాస్కులు ధరించకుండా బయటకు వచ్చిన వారికి వినూత్నమైన శిక్ష వేశారు పోలీసులు. ప్లకార్డులు ఇచ్చి అంబేడ్కర్ కూడలి వద్ద ప్రదర్శన నిర్వహించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్లకార్డులతో వివరించారు.

మాస్కులు లేకుండా వచ్చి ప్రజలకు రాజాం పోలీసుల ప్లకార్డుల దండన
ఇదీ చదవండి :