శ్రీకాకుళం జిల్లా రాజాం వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. మార్కెట్ కమిటీ అధ్యక్షులుగా పాలవలస పద్మావతి, గౌరవ అధ్యక్షులుగా ఎమ్మెల్యే కంబాల జోగులు, ఉపాధ్యక్షులుగా వేమిరెడ్డి సూర్యనారాయణతో పాటు పాలకవర్గ సభ్యులు ప్రమాణం చేశారు.
నూతనంగా ఎంపికైన రాజాం మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు పద్మావతితో పాటు పాలకవర్గ సభ్యులను విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే కంబాల జోగులు, జిల్లా డీసీసీబీ చైర్మన్ పాలవలస విక్రాంత్‌లు అభినందించారు. తొలుత అధ్యక్షురాలితో పాటు పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి అనంతరం మార్కెట్ కమిటీ రికార్డుల్లో సంతకాలు చేశారు.