సిరి ధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వాలి తెలిపారు. శ్రీకాకుళంలో నిర్వహించిన రైతు సదస్సుకు ఆయన హాజరయ్యారు. చిన్నయ్య ఆదివాసీ వికాస్ సంఘం ఆధ్వర్యంలో స్థానిక బాపూజీ కళా మందిర్‌లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రైతు నేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ వెంకటేశ్వరరావు సదస్సులో పాల్గొన్నారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి బాధితులకు.. ప్రకృతిలో లభించే పదార్థాలతో చేసే కషాయాలతో 9 నెలల్లో జబ్బు నయం అవుతుందని ఖాదర్ చెప్పారు. ప్రతీ ఒక్కరూ కషాయం, సిరిధాన్యాలను విధిగా వాడాలన్నారు. సామలు, అరికలు, కొర్రలు, ఊదలు, అండు కొర్రలు వంటిని ఆరోగ్యానికి దోహదం చేసే అద్భుతమైన ధాన్యాలని వివరించారు.
సిరి ధాన్యాలతో... సంపూర్ణ ఆరోగ్యం - pradarshana
శ్రీకాకుళంలో చిన్నయ్య ఆదివాసీ వికాస్ సంఘం ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ వెంకటేశ్వరరావు, శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వాలి హాజరయ్యారు.
రైతు సదస్సు