శ్రీకాకుళం జిల్లాలో రైతు భరోసా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని నరసన్నపేట మార్కెట్ కమిటీ ఆవరణలోని భరోసా కేంద్రాన్ని.. మంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. అనంతరం సమీకృత వ్యవసాయ పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఆయనతోపాటు జేసీ సుమిత్ కుమార్, వ్యవసాయ శాఖ జేడీ శ్రీధర్ తదితరులు ఉన్నారు.
ఆమదాలవలస మండలం తోగరము గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని శాసన సభాపతి తమ్మినేని సీతారాం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు పూర్తి న్యాయం చేకూరుతుందని అన్నారు. గతంలో రైతులు విత్తనాలు, ఎరువులు కావాలంటే ఇబ్బందులు పడేవారని.. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా వాటిని సులభంగా పొందవచ్చన్నారు.