శ్రీకాకుళం జిల్లాలో రాత్రి నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది. తెల్లవారుజాము నుంచే శ్రీకాకుళం, ఆమదాలవలస, లావేరు, నరసన్నపేట, జలుమూరు, సారవకోట, టెక్కలిలో వర్షం కురుస్తోంది. చలికాలంలో పంట చేతికి వచ్చే సమయానికి వానలు రావడం కోత దశలో ఉన్న పంట ఎక్కడ చేజారిపోతుందోనని ఆవేదన చెందుతున్నాడు. రాజాంతో పాటు మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి.
అకాల వర్షాలు.. ఆందోళనలో రైతులు - rains latest news update
శ్రీకాకుళం జిల్లాలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట కోత దశలో ఉంటుండగా వానలు రావడంతో నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అకాల వర్షాలు ఆందోళనలో రైతులు