ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం, దర్శి, అద్దంకి, అర్ధవీడు మండలాల్లో వర్షం కురుస్తోంది. త్రిపురాంతకంలో కురిసిన వర్షానికి బాలత్రిపురసుందరి ఆలయ ప్రాంగణంలో వర్షపు నీరు చేరింది. పట్టణంలో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. గుంటూరు జిల్లా వినుకొండలో కురిసిన వర్షానికి వినుకొండ జాతీయ రహదారిపై వర్షపు నీరు ప్రవహిస్తోంది.
RAINS : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం - ప్రకాశం జిల్లాలో వర్షం
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం(rain) కురుస్తోంది. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కురుస్తున్న వానలకు రహదారులు(roads) జలమయమయ్యాయి. త్రిపురాంతకం ఆలయంలో వర్షపు నీరు చేరడంతో భక్తులు(pilgrims problems) ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ నగరంలో వర్షం కురవడంతో రహదారులపై మోకాలు లోతు నీరు చేరింది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం
కృష్ణా జిల్లాలోని బాపులపాడు, ఉంగుటూరు, గన్నవరం, విజయవాడ గ్రామీణ మండలాల్లో వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. విజయవాడ నగరంలో కరుస్తున్న వర్షంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపై మోకాలు లోతు నీరు చేరడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నివాసముండే బ్రాహ్మణవీధిలో డ్రెయినేజీలు పొంగి పొర్లుతున్నాయి.
ఇదీచదవండి.