Rain In Srikakulam And Vizianagaram Districts: రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడుతుంటే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వర్షబీభత్సానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, కవిటి మండలాల్లో ఈదురు గాలులు, వర్షానికి పలు ప్రాంతాల్లో చెట్లు, పూరి గుడిసెలు నేలకూలాయి. విజయనగరంలో భారీ వర్షానికి చెట్లు కూలి వాటి కింద నిలిపిఉంచిన కార్లు దెబ్బతిన్నాయి. దీంతో అధికారులు సహాయకచర్యలు చేపట్టారు.
రెండు మండలాల్లో చిమ్మ చీకటి : శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం కవిటి మండలాల్లో భారీ ఈదురు గాలులు, వర్షం బీభత్సం సృష్టించింది. మంగళవారం సాయంత్రం ఒకసారిగా కారు మబ్బులుతో కూడిన ఉరుములు మెరుపులతో దదిరిల్లి భయ బ్రాంతులకు గురి చేసింది. రెండు మండలాల్లో చిమ్మ చీకటితో అలమ కొన్నాయి . అనంతరం వర్షంతో పాటు వీచిన ఈదురు గాలులకు పలు ప్రాంతాలలో చెట్లు తోపాటు చెట్ల కొమ్మలు పూరి గుడిసెలు నెలకొరిగాయి. ఇనుప రేకు గాలికి ఎగిరి ఇచ్చాపురానికి చెందిన పాండవ మోహిని తలకు తహలడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను ఇచ్చాపురం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న తహశీల్దార్ గురు ప్రసాద్ ఆమెతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇచ్చాపురం జాతీయ రహదారి బెల్లుపడ కోడలు వద్ద సంబరాలకు ఏర్పాటు చేసిన భారీ గేటు నేలకొరడంతో విద్యుత్తు అంతరాయంతో పాటు రాకపోకలు స్తంభించాయి.