'ఎచ్చెర్లలో ఉరుములు...మెరుపులతో కూడిన వర్షం' - srikakulam
ఒక వైపు ఎండ... మరోవైపు వానతో ఎచ్చెర్ల నియోజకవర్గంలోని ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఎండల వేడి నుంచి వర్షంతో కాసేపు సేదతీరినా... ఈదురుగాలులు, ఉరుములతో కొంత భయభ్రాంతులకు గురయ్యారు.
'ఎచ్చెర్లలో ఉరుములు...మెరుపులతో కూడిన వర్షం'
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో నిన్న సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక వైపు ఎండా, మరోవైపు తీవ్ర ఉక్క పోత తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షంతో కొంతమేరకు ఉపశమనం పొందినా... గాలులు తీవ్రంగా వీయటంతో.... భారీ శబ్దాలతో కూడిన ఉరుములతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.