ఉత్తరాంధ్రలో వచ్చే రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు ఆర్టీజీఎస్ హెచ్చరించింది. అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని.... అలలు రెండున్నర నుంచి 4 మీటర్ల ఎత్తువరకు ఎగసిపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రజలు సముద్రతీర ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించింది. వేటకు వెళ్లే మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేసింది.
ఉత్తరాంధ్రకు 2 రోజుల పాటు భారీ వర్ష సూచన - rain chances in utharanadhra area: RTGS
అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్రలో వచ్చే రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు ఆర్టీజీఎస్ హెచర్చింది. మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఉత్తరాంధ్రలో వచ్చే రెండు రోజులపాటు వర్షాలు: ఆర్టీజీఎస్