ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కర్ఫ్యూ కష్టాలు: స్వస్థలాలకు వెళ్లేందుకు రైల్వైే ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు

By

Published : May 18, 2021, 7:25 PM IST

కరోనా కర్ఫ్యూ కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దూర ప్రాంతాల నుంచి రైళ్లలో వచ్చే ప్రయాణికులు ఇళ్లకు చేరుకునేందుకు బస్సులు లేకపోవటంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న ప్రైవేటు వాహనదారులు.. ప్రయాణికుల నుంచి భారీగా డబ్బు వసూలు చేస్తున్నారు.

స్వస్థలాలకు వెళ్లేందుకు రైల్వైే ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు
స్వస్థలాలకు వెళ్లేందుకు రైల్వైే ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస రైల్వేస్టేషన్​లో రాకపోకలు సాగించే ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా కర్ఫ్యూ కారణంగా బస్సులు లేకపోవటంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ఆటోవాలాలు, క్యాబ్ డ్రైవర్లు అందిన కాడికి దోచుకుంటున్నారు. ప్రయాణికులను స్వస్థలాలకు చేరవేసేందుకు రూ. 500 వందల నుంచి రూ. 2 వేల వరకు దండుకుంటున్నారు.

కరోనా కష్ట కాలంలో తాము ఇంత మెుత్తంలో డబ్బు వెచ్చించి ప్రయాణాలు చేయలేకపోతున్నామని ప్రభుత్వం స్పందించి వాహనాలు ఏర్పాటు చేయాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.

ఇదీచదవండి: రఘురామకు వైద్య పరీక్షలు ప్రారంభం.. ప్రత్యేక మెడికల్ బోర్డు పర్యవేక్షణ

ABOUT THE AUTHOR

...view details