ప్రజా పోరాటాలతోనే సమస్యలకు సరైన పరిష్కారం దొరుకుతుందని సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పూండిలో మత్స్యకార సామాజిక సాంస్కృతిక సమితి నిర్వహించిన విశాఖ ఉక్కు పరిరక్షణ - ఆంధ్రుల హక్కు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 11 ఏళ్ల వయస్సులో విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొన్నానన్న ఆర్.నారాయణమూర్తి.. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోకపోతే పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. నాలుగు మత్స్యకార మండలాల నూతన సర్పంచిలను సన్మానించిన నారాయణమూర్తి.. ఉద్వేగభరితంగా పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ప్రజా పోరాటాలతోనే పరిష్కారం దొరుకుతుంది:ఆర్.నారాయణమూర్తి - visakha steel plant news
కేంద్రం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోకపోతే పోరాటం ఉద్ధృతం చేస్తామని ఆర్.నారాయణమూర్తి హెచ్చరించారు. ప్రజా పోరాటాలతోనే సమస్యలకు సరైన పరిష్కారం దొరుకుతుందన్నారు.
ఆర్.నారాయణమూర్తి