ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆర్.నారాయణమూర్తి చేతుల మీదుగా... 'బహుళ' నవల ఆవిష్కరణ - ఆర్ నారాయణ మూర్తి చేతుల మీదుగా శ్రీకాకుళంలో బహుళ నవల ఆవిష్కరణ

కళింగాంధ్ర ఉద్యమ జీవితంపై ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు రచించిన బహుళ నవలను.. ప్రముఖ నటులు ఆర్​. నారాయణమూర్తి ఆవిష్కరించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని బాపూడి కళామందిర్​లో ఈ కార్యక్రమం జరిగింది. సుమారు వందేళ్ల చరిత్రను గ్రామీణ భాషలో అక్షరీకరించారంటూ రచయితను పీపుల్​స్టార్ అభినందించారు.

bahula novel inauguration in srikakulam, bahula novel released by r narayanamurthy in srikakulam
శ్రీకాకుళంలో బహుళ నవల ఆవిష్కరణ, బహుళ నవల ఆవిష్కరించిన ఆర్ నారాయణమూర్తి

By

Published : Mar 28, 2021, 7:32 PM IST

ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు రచించిన 'బహుళ' నవల ఆవిష్కరణ సభ.. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్​లో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, పీపుల్ స్టార్​గా ప్రసిద్ధిగాంచిన ఆర్. నారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళింగాంధ్ర గుండె ఘోషగా వర్ణించదగ్గ 470 పేజీల నవల పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.

కళింగాంధ్ర ఉద్యమ జీవితాన్ని, పోరాట అనుభవాలను కళ్లకు కట్టినట్లు.. సుమారు వందేళ్ల చరిత్రను నూటికి నూరు పాళ్లు గ్రామీణ భాషలో అక్షరీకరించిన గ్రంథం 'బహుళ' అని నారాయణమూర్తి కొనియాడారు. ఒక నవల శోధించగల సత్యాన్ని 'బహుళ' ద్వారా ఆవిష్కరించారంటూ అభినందించారు. ప్రజల జీవితానుభవాలను ప్రతిబింబించే విశిష్టమైన రచనలు ఇంకెన్నో అప్పలనాయుడు చెయ్యాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, రైతాంగ వ్యతిరేక విధానాలు రైతులకు శాపంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details