ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రజాధనాన్ని వైకాపా కార్యకర్తలకు దోచిపెడుతున్నారు' - వైకాపాపై సోము వీర్రాజు విమర్శలు

గ్రామ సచివాలయాలపై భాజపా నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర విమర్శలు గుప్పించారు. సచివాలయాల పేరుతో ప్రజాధనాన్ని వైకాపా తమ కార్యకర్తలకు పంచిపెడుతోందని ఘాటు విమర్శలు చేశారు.

ఎమ్మెల్సీ సోము వీర్రాజు

By

Published : Oct 18, 2019, 6:00 PM IST

'ప్రజాధనాన్ని వైకాపా కార్యకర్తలకు దోచిపెడుతున్నారు'

రివర్స్‌ టెండరింగ్ పేరుతో ప్రజాధనం ఆదా చేశామంటున్న వైకాపా,ఆ సొమ్మును గ్రామ సచివాలయాల రూపంలో తమ కార్యకర్తలకు అప్పగిస్తోందని భాజపా నేత,ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు.గ్రామ సచివాలయం పథకం పబ్లిసిటీ కోసం వినియోగించిన గాంధీ బొమ్మపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.ప్రజలు భాజపాలో చేరుతుంటే వైకాపా కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని వీర్రాజు ఆరోపించారు.మరో20ఏళ్లు అధికారంలో ఉండేందుకు వైకాపా ఆరాటపడుతోందని,అది సాధ్యపడే అంశం కాదని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details