కాలినడకన వెళ్లే వలసకూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఆహారం, వసతి కల్పించాలని ఆదేశించిన నేపథ్యంలో .. ఆయా ప్రాంతాలలో ఆహార శిబిరాలు ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం తామరపల్లి గ్రామం వద్ద ప్రత్యేక ఆహార శిబిరం ఏర్పాటు చేశారు. వలసకూలీలకు భోజనాన్ని తహసీల్దార్ ప్రవళికప్రియ అందజేశారు. ఈ శిబిరాన్ని జిల్లా జేసీ శ్రీనివాసులు పరిశీలించారు. రోడ్డు మార్గంలో ప్రయాణించే వారికి ఆహారం అందివ్వాలని.. గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు.
ప్రత్యేక శిబిరాల్లో వలసకూలీలకు ఆహారం అందజేత - శ్రీకాకుళం జిల్లాలో వలసకూలీలకు ఆహారం అందజేత
కాలినడకన వెళ్లే వలస కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించింది. శ్రీకాకుళం జిల్లా తామరపల్లిలోని ఆహార శిబిరంలో వలసకూలీలకు భోజనాన్ని తహసీల్దార్ ప్రవళికప్రియ ఏర్పాటు చేశారు
![ప్రత్యేక శిబిరాల్లో వలసకూలీలకు ఆహారం అందజేత Provided food for migrant laborers in special camps at thamarapalli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7239804-372-7239804-1589732173680.jpg)
ప్రత్యేక శిబిరాలలో వలసకూలీలకు ఆహారం అందజేత