శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం జాతీయ రహదారిపై లారీల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి వందలాది మంది వలస కూలీలు రాకపోకలు సాగిస్తున్నారు. అధికంగా ఒడిశా, భువనేశ్వర్, ఝార్ఖండ్ తదితర ప్రాంతాలకు లారీల్లో వెళుతున్నారు. ఈ క్రమంలో ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నవారికి శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో స్థానికులు ఆహారం అందించారు. లారీల్లో ప్రయాణిస్తున్న సుమారు వెయ్యి మందికి బొంతుపేట సమీపంలో స్థానికులు ఆహార పదార్థాలను అందించారు.
వలస కూలీల ఆకలిబాధలు తీరుస్తున్న దాతలు - corona list in srikakulam dst
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులతో వలస కూలీలు సొంత గూటికి చేరే మార్గం దొరికింది. అధికారులు వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను రైళ్లు ,బస్సుల ద్వారా తరలిస్తున్నారు. అయినా కొందరు కాలినడకన, సైకిళ్లపై గమ్యస్థానానికి చేరుతున్నారు.
provide food to migrate workers in srikakulam dst nationa highway