కరోనా నుంచి కోలుకున్న వారిని ఆందోళనకు గురిచేస్తున్న బ్లాక్ ఫంగస్ కేసు రాష్ట్రంలోనూ నమోదైంది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ ఈ వ్యాధి బారిన పడ్డారు. నరసన్నపేట మండలం దాసరి వానిపేట గ్రామానికి రామకృష్ణకు గత నెల 3న కరోనా వైరస్ సోకింది. శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో వారం రోజులపాటు చికిత్స తర్వాత గత నెల 14న డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం కొద్ది రోజులకు బ్లాక్ ఫంగస్ సోకినట్లు గుర్తించారు. ప్రస్తుతం అయిదుగురు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నట్లు ఆయన సోదరుడు అనిల్‌కుమార్ తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసు.. - latest news in srikakulam district
శ్రీకాకుళం జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది. నరసన్నపేటకు చెందిన ఓ వ్యక్తి బ్లాక్ ఫంగస్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
బ్లాక్ ఫంగస్ వ్యాధి
Last Updated : May 15, 2021, 8:52 AM IST